మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి
VZM: ఆరోగ్యానికి హాని కలిగించే మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని గజపతినగరం సీఐ జిఏవి రమణ కోరారు. బుధవారం గజపతినగరం మండలం బూడిపేట గ్రామంలో ప్రత్యేక జాతీయ సేవా పథకంలో ర్యాలీ, సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల ప్రభావం వాటి నివారణ చర్యలు గురించి వివరించారు.