VIDEO: మైలార్‌దేవ్ పల్లిలో అగ్నిప్రమాదం
RR: మైలార్‌దేవ్‌పల్లి కాటేదాన్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమిత్ టింబర్ డిపో, బి.డి. ప్లైవుడ్ గోదాముల్లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో శ్రమించి మంటలను అదుపు చేశారు. సుమారు రూ. కోటి మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.