వృద్ధురాలి మెడ నుంచి పుస్తెలతాడు లాకెళ్లిన దుండగుడు

WGL: పర్వతగిరి మండలం చింత నెక్కొండలో వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడును అపహరించిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం వృద్ధురాలు బండి మల్లమ్మ ఇంటి వద్ద ఉన్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మాటలు కలిపి మెడలోని సుమారు మూడున్నర తులాల పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.