గ్రామ ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు ఏర్పాటు

గ్రామ ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు ఏర్పాటు

KDP: సిద్దవటం మండలంలోని పెద్దపల్లి పంచాయతీ రామస్వామి పల్లె ఎస్టీ కాలనీ ప్రజలకు ఆదివారం భాకరాపేట గ్రామ సర్పంచ్ తుర్రా చిన్నక్క ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో గత మూడు రోజుల నుండి త్రాగునీటి సమస్య తలెత్తిందన్నారు. దీంతో గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని ఏర్పాటు చేశామన్నారు.