VIDEO: భారీ వర్షం తడిసి ముద్దైన ధాన్యం
SRCL: కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో అకాల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలుల దాటికి రహదారులకు ఇరువైపులా పలు గ్రామాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి. పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం దాటికి కోతకు వచ్చిన వరి పంట నేలపాలైంది. మరికొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.