వరంగల్ రైల్వే స్టేషన్‌కు త్రివర్ణ కాంతులు!
WGL: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ రైల్వే స్టేషన్‌ను త్రివర్ణ పతాక రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణతో స్టేషన్ భవనం ఆకర్షణీయంగా మెరిసింది. సంబంధిత ఫొటోలను సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే తమ అధికారిక X ఖాతాలో పంచుకుంది.