బిర్యానీలో ట్యాబ్లెట్లు.. స్పందించిన GHMC

HYD: ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న గ్రీన్ బావర్చి బిర్యానీలో టాబ్లెట్లు రావడంతో ఓ కస్టమర్ GHMCకి ఫిర్యాదు చేశారు. దీనిపై GHMC యంత్రాంగం స్పందించింది. ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు త్వరలోనే తనిఖీలు చేపట్టి, రెస్టారెంట్ యజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఫుడ్ కల్తీపై ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని పేర్కొంది.