తప్పుడు వదంతులు నమ్మొద్దు: సీఐ
SKLM: చిన్న పిల్లలకు మత్తు పదార్థాలు అందించి అపహరించే మహిళలు తిరుగుతున్నారనే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని జె.ఆర్.పురం సీఐ అవతారం బుధవారం తెలిపారు. జి.సిగడాంకి చెందిన నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపామని చెప్పారు. విచారణలో మహిళలు ఇత్తడి వస్తువుల దొంగతనానికి సంబంధించిన వారేనని, పిల్లలను అపహరించే వారు కాదని స్పష్టంచేశారు.