'బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి'

అన్నమయ్య : రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు యుగంధర్ కోరారు. ఈ సందర్భంగా సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ శ్రీధర్‌కి వినతి పత్రాన్ని సమర్పించారు. బీసీలకు రాజ్యాధికారం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమని యుగంధర్ తెలియజేశారు.