తల్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన పోలీసులు
విజయనగరంలో ఆదివారం ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరించారు. బాధ్యతగా వ్యవహరించాలని కోరుతూ, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు.