నేరం రుజువైతే మూడేళ్లు జైలు శిక్ష

విశాఖ: ఎన్నికల కోడ్ నేపథ్యంలో సామాజిక మధ్యమాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చింతపల్లి ఏఎస్‌పి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. వాట్సాప్ ఇతర సోషల్ మాధ్యమాలలో అభ్యంతరకర అసభ్యకరమైన పోస్టులు పెడితే సంబంధిత వ్యక్తితో పాటు అడ్మిన్ పైన క్రిమినల్ కేసులు నమోదు అవుతాయన్నారు. నేరం రుజువైతే మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని యువత రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండాలన్నారు.