నేరస్థుడిని కాదు.. నేరాన్ని ద్వేషించండి: బండి

నేరస్థుడిని కాదు.. నేరాన్ని ద్వేషించండి: బండి

TG: బండ్లగూడలో జరిగిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్-2025 ముగింపు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో జైళ్ల శాఖ అధికారులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. జైళ్లలో కస్టడీ అనేది దిద్దుబాటు చర్యగా ఉండాలని పేర్కొన్నారు. గాంధీ చెప్పినట్లు 'నేరస్థుడిని కాదు, నేరాన్ని ద్వేషించండి' అని తెలిపారు.