యుద్ధం ఎఫెక్ట్... జిల్లాలో ఐరన్ ధరకు రెక్కలు..!

యుద్ధం ఎఫెక్ట్... జిల్లాలో ఐరన్ ధరకు రెక్కలు..!

W.G: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, ఉక్కు ఉత్పత్తి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో జిల్లాలో టన్ను సుమారు ₹60,000 వరకు ఉన్న ఐరన్ ధర ఇప్పుడు ఏకంగా ₹73,000 మార్కును తాకింది. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయిలో ధర పెరగడం గమనార్హం.