కేటీఆర్‌ను రైతు ఉత్సవాలకు ఆహ్వానించిన మంత్రి తుమ్మల
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నూతనంగా నిర్మించిన టీజీ ఆయిల్ ఫెడ్ ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ను కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి స్వయంగా కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కర్మాగారం ప్రారంభం ద్వారా ఆయిల్ పామ్ సాగు చేసే వారికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.