గోదావరి ఘాట్‌లో భూగర్భ విద్యుత్ పనులకు శంకుస్థాపన
E.G: గోదావరి ఘాట్ ప్రాంతంలో రూ.13.12 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులకు రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. 2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల భద్రత, నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.