BREAKING: బాణాసంచా కాల్చడంపై నిషేధం

TG: భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధించారు. నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పారు. ఒకవేళ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.