గుర్తు తెలియని మృతదేహం లభ్యం

W.G: వీరవాసరం మండల కేంద్రంలోని రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. మృతదేహాన్నిగుర్తించిన వారు వీరవాసరం పోలీస్ స్టేషన్‌లో సమాచారమివ్వాలన్నారు.