VIDEO: భారీ వర్షం.. కరెంటు స్తంభానికి మంటలు

GNTR: జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా ఇవాళ డొంక రోడ్డులో కరెంటు స్తంభం వైర్లు తెగి మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.