నందవరంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
NDL: బనగానపల్లె మండలం నందవరంలో శ్రీ చౌడేశ్వరి మాత ఉత్సవాల సందర్భంగా ఈ నెల 23న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పీవీ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. విజేతలకు వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు పోటీలలో పాల్గొనాలని కోరారు.