రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని మృతదేహం

రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని మృతదేహం

KKD: తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నవరం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన 40 ఏళ్ల గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు రైలు నుంచి జారిపడి లేదా ఆత్మహత్య చేసుకోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు ఎస్సై శ్రీనివాసరావు. పోలీసులు మృతదేహాన్ని భద్రపరచి మరింత విచారణ కోసం మార్చురీ ఏరియా ఆసుపత్రికి తరలించారు.