వణికిస్తున్న ఓటర్ల జాబితా సవరణ
బెంగాల్‌లో వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది. అయితే SIR ప్రక్రియ తర్వాత ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.44 కోట్లకు తగ్గడం అనేక నియోజకవర్గాల్లో సమీకరణాలను మార్చేసింది. అవినీతి ఆరోపణలు, వర్గ విభేదాలను అధిగమించడం TMCకి సవాలుగా మారాయి. మొత్తం 294 స్థానాలకు గానూ గత ఎన్నికల్లో TMC 215 సీట్లు గెలుచుకుంది.