యుద్ధం తర్వాత ఆ నౌకలపై ఛార్జీలు!

యుద్ధం తర్వాత ఆ నౌకలపై ఛార్జీలు!

హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై రుసుము(ఫీజు) విధించాలని ఇరాన్ యోచిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను వెల్లడించనున్నట్లు సమాచారం. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఛార్జీలు విధిస్తే అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ప్రపంచ దేశాల మధ్య కొత్త ఉద్రిక్తతలకు దారితీయవచ్చు.