ఎకో టూరిజం ప్రతిపాదన వద్దని నిరసన
ASR: మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ వద్ద అటవీ శాఖ ఎకో టూరిజం వద్దు, మాకు స్వయం ఉపాధి కావాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ వద్ద గిరిజనులు నిరసన తెలిపారు. గత 4ఏళ్ళగా ఈ వ్యూ పాయింట్ వద్ద స్వయం ఉపాధి పొందుతున్నామని, ఎకో టూరిజంతో తమను యాచకులుగా మార్చవద్దని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ స్ధలం అటవీ శాఖ పరిధిలోది కాదన్నారు.