సీపీఐ మహాసభలకు జిల్లా నాయకులు

KMR: మేడ్చల్ జిల్లాలో బుధవారం సీపీఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సభలకు కామారెడ్డి జిల్లా నుంచి సీపీఐ సీనియర్ నాయకులు, న్యాయవాది వి.ఎల్. నరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి దశరథ్, జిల్లా సహాయ కార్యదర్శి బాలరాజుతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ.. మహాసభల్లో ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చిస్తామని వివరించారు.