కాచి చల్లార్చిన నీటినే తాగాలి: కమిషనర్

కాచి చల్లార్చిన నీటినే తాగాలి: కమిషనర్

GNTR: జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కాచి చల్లార్చిన నీటినే తాగాలని పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు సూచించారు. తాగునీటి సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 08643247737 నంబర్‌కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30లోపు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.