ఔషధాల నమూనాల విశ్లేషణకు అధికారుల నియామకం

AP: రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతరులు పంపిన ఔషధాల నమూనాలను విశ్లేషించి, నివేదికలు ఇచ్చేందుకు ముగ్గురు అధికారులను ప్రభుత్వం నియమించింది. షెడ్యూల్ 'సి' కింద పేర్కొన్నవి మినహా మిగిలిన అన్ని రకాల మందులు, కాస్మెటిక్స్ శాంపిళ్ల విశ్లేషణకు జూనియర్ సైంటిఫిక్ అధికారులు జి.ప్రవీణ్ కుమార్, ఎం.చిరంజీవి, బి.ఉమామహేశ్వరరావుని విశ్లేషకులుగా ప్రభుత్వం నియమించింది.