బావిలో గుర్తుతెలియని మృతదేహం

PLD: దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలో ఒక పాడుబడ్డ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్సై సుధీర్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం సుమారు నాలుగు రోజుల క్రితం బావిలో పడినట్లుగా ఉందని, శరీర గుర్తులు, దుస్తుల ఆధారంగా ఆచూకీ తెలుసుకుంటామని ఎస్సై తెలిపారు.