పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
కృష్ణా: మచిలీపట్నం ఆర్ పేట పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఆదేశాలతో స్థానిక చమ్మనగిరిపేట ప్రాంతంలో రహస్యంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,600ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ యేసుబాబు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.