VIDEO: చందర్లపాడులో భారీ వర్షం
NTR: చందర్లపాడు మండలం వేలాదికొత్తపాలెంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో భారీ వర్షం కురిసింది. ఇటువంటి అకాల వర్షాల కారణంగా పత్తి, మొక్కజొన్న పంటలకు సరైన దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉండదేమోనని రైతులు వాపోయారు. గ్రామంలో విచిత్రమైన వాతావరణం ఉందని, భారీ వర్షం కురిసిన వెంటనే ఎండ కాస్తుందని స్థానికులు అంటున్నారు.