'గ్రామీణ కూలీల హక్కులపై కేంద్రం దాడి'
WGL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో, కేంద్ర ప్రభుత్వం కుట్రపూర్వకంగా పథకాన్ని బలహీనపరుస్తోందని విమర్శించారు. ఈ నిర్ణయం గ్రామీణ కూలీల హక్కును హరించే చర్య అని ఆయన పేర్కొన్నారు.