ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు నిజాయితీ, నిస్వార్థంతో ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పురపాలక సంఘంలో నలుగురు ఉద్యోగులకు కారుణ్య నియామక పత్రాలు, ఐదుగురు ఔట్సోర్సింగ్ సిబ్బందికి నియామక పత్రాలను ఎమ్మెల్యే రాము పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.