ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం సందర్శించిన జిల్లా అధికారి

MDK: మాసాయిపేట ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంను జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ సందర్శించారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని, కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇందులో ఏవో రాజశేఖర్, ఏఈవో రజిత, ఆగ్రోస్ మహేష్, రైతులు నాగరాజు, స్వామి, రాములు, మల్లేష్ పాల్గొన్నారు.