విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి ఛలో కలెక్టరేట్

VZM: ఈనెల 25న విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఛలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని SFI విజయనగరం జిల్లా కార్యదర్శి వెంకటేష్ తెలియజేశారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న 6400కోట్ల ఫీజు రీ యాంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, GO నంబర్ 77 రద్దు చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాలని, హాస్టల్స్ మెస్ బిల్లులు చెల్లించాలని కోరారు.