VIDEO: 'డెయిరీ పాలు విషయంలో అపోహలు నమ్మొద్దు'
కోనసీమ: డెయిరీ పాలు విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని, అవి పూర్తిగా సురక్షితమైనవని కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షులు సి.వి.సర్వేశ్వర శర్మ తెలిపారు. ఆయన అమలాపురంలో మంగళవారం మాట్లాడుతూ.. రాజమండ్రిలో ప్రోపలైన్ గ్లైకాల్ బదులు ఎథిలీన్ గ్లైకాల్ ఉపయోగించడం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. డెయిరీ పాలు నాణ్యమైన ప్రమాణాల నడుమ తయారవుతాయన్నారు.