ఒక్క బస్తా యూరియా కోసం రైతుల కష్టాలు

ఒక్క బస్తా యూరియా కోసం రైతుల కష్టాలు

NLG: కట్టంగూరులో బస్తా యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. గురువారం లారీ లోడ్ (330 బస్తాలు) రావడంతో రైతులు ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసులను పిలిపించి, పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు సీరియల్‌లో పెట్టి ఒక్కో బస్తా చొప్పున యూరియా ఇచ్చారు. యూరియా దొరకని వారు వాగ్వాదానికి దిగారు. 600 మె. టన్నుల యూరియా వస్తుందని అధికారులు తెలిపారు.