కన్న తండ్రిని చంపిన కుమారుడు

కన్న తండ్రిని చంపిన కుమారుడు

MBNR: కన్న తండ్రిని కుమారుడు చంపిన ఘటన నవాబుపేట మండలం కామారంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిలుక కృష్ణయ్య(50) అనే వ్యక్తి పేరు మీద ఉన్న 30 గుంటల భూమిని తన పేరుపై రాయించాలని కుమారుడు వెంకటేష్ అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే తండ్రిపై వెంకటేష్ రాయితో తలపై కొట్టి చంపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.