పాదాలు పగులుతున్నాయా?.. ఇలా చేయండి
శీతాకాలంలో చలి గాలుల వల్ల పాదాలు పగలడం సర్వసాధారణం. అయితే ఇది తీవ్ర నొప్పి కలిగిస్తుంది. ఈ క్రమంలో పగుళ్లను తగ్గించుకునేందుకు కొన్ని హోమ్ రెమెడీస్ పాటించొచ్చు. పగుళ్ల మీద తేనె/ కొబ్బరినూనె/ ఆలివ్ ఆయిల్ రాస్తే త్వరగా తగ్గిపోతాయి. ఇవి సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. అలాగే తులసి, కలబంద గుజ్జు లేదా రోజ్ వాటర్ కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.