శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

KRNL: శ్రీశైలం ఘాట్ రోడ్‌లోని చిన్నారుట్ల వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా సిద్ధవటంకు చెందిన కొంగ సుబ్బారెడ్డి (44) మృతి చెందారు. శ్రీశైల మల్లన్నను దర్శించుకొని భార్యతో కలిసి బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు దోర్నాల ఎస్సై మహేశ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.