రేపు హైటెక్ సిటీలో టెక్ బీ ప్రోగ్రాం

HYD: హెచ్సీఎల్ టెక్ సంస్థ నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కోసం సీఈసీ, బైపీసీ, ఒకేషనల్, హెచ్ఐసీ గ్రూపులతో 2023-24లో 75 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 24న హైటెక్ సిటీలోని హెచ్సీఎల్ కార్యాలయంలో హాజరుకావాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.