కర్నూలు జిల్లాలో ఫ్రీ జర్నీ ప్రారంభం

KNRL: జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. ఆదోనిలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, TDP నేత మీనాక్షి నాయుడు, కూటమి నేతలు ఉచిత బస్సులను ప్రారంభించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అని తెలిపారు.