పంట అమ్ముకోవాలంటే.. కష్ట పడాల్సిందే..!
KMR: దుక్కి దున్ని విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతన్నలకు కష్టాలే. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఆరబెట్టిన ధాన్యం తడిసింది. ధాన్యం విక్రయానికి తేమను తగ్గించుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. రైతులు పడుతున్న కష్టాలకు అద్దం పట్టేలా పిట్లం - బాన్సువాడ ప్రధాన రహదారిపైనే పదుల సంఖ్యలో ధాన్యం రాశులు కనబడుతున్నాయి.