మరికల్‌లో ఘనంగా సీతారామ కళ్యాణోత్సవం
NRPT: మరికల్ మండల కేంద్రంలోని మాధవరం రోడ్డుపై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. సర్పంచ్ చెన్నయ్య దంపతులు, సీఐ భగవంత్ రెడ్డి, ఎస్సై రాము దంపతులు తలంబ్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. భాజాభజంత్రీల మధ్య కళ్యాణం వైభవంగా జరుగనుందని ధర్మకర్త వర్కూరు సత్యనారాయణ తెలిపారు.