VIDEO: కుట్టు మిషన్లు అందించాలని ఎమ్మెల్యేకు వినతి

W.G: నాలుగు నెలలుగా కుట్టు మిషన్లలో శిక్షణ పొందుతున్నామని, ఇప్పటి వరకు మిషన్లు అందించలేదని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు శిక్షణ పొందుతున్న మహిళలు తెలిపారు. వీరవాసరం పంచాయతీ కార్యాలయంలో మంగళవారం 70 మంది మహిళలు ఎమ్మెల్యేను కలిసి తమకు కుట్టు మిషన్లు ఇప్పించాలని వినతి చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి త్వరలోనే కుట్టు మిషన్‌లు అందజేస్తామని హామీ ఇచ్చారు.