కేజీహెచ్‌లో ప్రమాదంపై వాసుపల్లి ఆగ్రహం

కేజీహెచ్‌లో ప్రమాదంపై వాసుపల్లి ఆగ్రహం

VSP: కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో శనివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఇటీవల 12 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడిన ఘటన మరువకముందే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంపై దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన మండిపడ్డారు. ఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు