VIDEO: రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

అన్నమయ్య: రాయచోటి చిత్తూరు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బొలెరో పికప్ వాహనం స్కూటీని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతుడు దిగువ అబ్బవరం గ్రామానికి చెందిన చందు (20)గా గుర్తించారు. సమాచారం అందుకున్న డిఎస్పీ కృష్ణమోహన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.