ఇజ్రాయెల్ తర్వాతి టార్గెట్ మేమే: పాక్
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు. పాక్‌ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఈ కుట్రలో ఆఫ్ఘనిస్తాన్, భారత్ భాగస్వామిగా ఉన్నాయని ఆరోపించారు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే పాక్‌కు ఇబ్బందేనని వ్యాఖ్యానించారు. అప్పుడు భారత్, ఆఫ్ఘన్, ఇజ్రాయెల్ ఒక్కటై పాక్‌పై దాడి చేస్తాయని తెలిపారు.