చేనేత దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేత

SS: ధర్మవరం పట్టణంలోని కదిరి గేట్ వద్ద ఉన్న నేతన్న విగ్రహం సమీపంలో రేపు ఉదయం 10 గంటలకు జాతీయ చేనేత దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లను బీజేపీ నేత హరీష్ బాబు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, పక్కా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.