జిల్లాకు వర్ష సూచన

జిల్లాకు వర్ష సూచన

కోనసీమ: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. ఇవాళ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడినప్పుడు ప్రజలు చెట్ల కింద ఉండకూడదని సూచించింది. రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.