గచ్చిబౌలి పీజేఆర్ ఫ్లైఓవర్‌పై వాహనం బ్రేక్ డౌన్

HYD: గచ్చిబౌలి పీజేఆర్ ఫ్లైఓవర్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ (ORR), నానక్ రామ్ గూడ వైపు వెళ్లే మార్గంలో వాహనం మొరాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు అవాంతరాన్ని తొలగించడానికి కృషి చేస్తున్నారు. ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణించాలని, తదననుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. వాహనాన్ని పక్కకు తరలించేందుకు చర్యలు చేస్తున్నారు.