రాజన్న ఆలయంలో మహాలింగార్చన
SRCL: దక్షిణ కాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీకమాస రెండవ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ఆలయంలో మహాలింగార్చన పూజ ఘనంగా నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు చేశారు. అద్దాల మండపంలోని స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.